1, సెప్టెంబర్ 2016, గురువారం

టూరింగు టాకీసు నుండి మల్టిప్లేక్స్ వరకు

నాడు :


అమ్మ తొందరగానె పొలం నుండి వచ్చింది ఈరోజు.. పాలు కూడ తొందరగానె పిండేసి లక్ష్మి అక్క వాళ్ళకు ఇవ్వాల్సిన భాగం నా చేతికి ఇచ్చి పంపిస్తూ లక్ష్మక్కని తొందరగ తయారు
కమ్మన్నాన ని చెప్పమని చెప్పింది..

.. నేను లక్ష్మక్కకి  కబురుపెట్టొచ్చి మొహం కడుక్కొనేలోపు అమ్మ అప్పటికే తనకి బాగ నప్పే నెమలి బొమ్మలుండే పసుపు రంగు చీర కట్టుకుని ఎంచక్క పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ..చెవికి దుద్దులు పెట్టుకొని ..ముందుగానె చిమ్మిన  ఇంటి ముందు భాగం లొ చిన్న ముగ్గు వేసేసి.. టక టక మని పూజ చేస్తా  .. కడపమాను(గడప) పై  నీళ్ళు చల్లి ఊదిగడ్లు (అగరబత్తి) వెలిగించి రమ్మని నాకు పురమాయించింది ..ఇంతలోనె లక్ష్మక్క రానే వచ్చింది ..చిన్నా అమ్మింకా తయారు కాలేదా అంటూ ..తన నేస్తం ఎర్రిసామన్నని చూసి ఏంటి ఎర్రిసామి నువ్వు ఈ సారి కూడ రావడం లేదా అంటూ పలకరించింది .. తను చిన్నగ నవ్వేసి లేదక్క మీరెల్లేసి రండి నేను ఇంటికాన్నె ఉంటా అన్నాడు.


ఇంతలోనె వాతాపిగణా పతింబజే .. అంటూ పాట వినపడింది. రోజు మాదిరిగానె ..
వదినా ఇంకా ఎంత సేపు పూజ .. తొందరగ రా ..
వచ్చె వచ్చె .. ఊ సారి ఇల రా
ఇదుగో పొద్దూన్నె మందారం పూసింది నీకిద్దమని అట్టె పెట్టా..
మరి నీకో ..
మీ అన్న పొద్దునే పూల సాయిబుతో .. పూలు తీపించాడు అంది నవ్వుతూ..
ఇటు తిరుగు .. జల్లో మల్లెపూలు పెట్టి ..దానిపై ముద్ద మందారం పెట్టి..
అబ్బ నా దిస్టే తగిలేలా ఉంది లక్ష్మి .. ఉండూ ఎడమకాలుకి చేతికి కంటికి దిస్టి చుక్క పెట్టనీ నన్ను..
లక్ష్మక్క  నవ్వుతూ. తొందరగా వదిన అప్పుడే నమో వెంకటేశ  పాట కూడ అయిపొయింది ..
మనం వెళ్ళేలోపె మొదలవుతుందేమొ అని కంగారు పడుతోంది
మీ అన్న అక్కడే ఉంటానని చెప్పాడ్లె..చిన్నా మీ నడిపత్తని రామక్కవ్వని సోమక్క పిన్నమ్మని చెరనమ్మ పెద్దమ్మ ని రమ్మని మన్నానని  చెప్పు ..అంది  అమ్మ

నేను వసారింటికి వెల్లేలోపె వాల్లందరు యెదురయ్యారు ..

యెర్రిసామి తిని తాలం వేస్కొని ఇక్కడె బయట లైటు వేసుకొని ..కట్ట మీదనె పడుకో .. అని చెప్పి అమ్మ నేను లక్ష్మక్క .. మిగతవాల్లు హడావిడిగా.. బయలేదేరాం..

ఉమా మల్లికార్జున టూరింగు టాకీసు ..కొనకొండ్ల గ్రామం ..పెద్ద బోర్డు .. దాని పక్కనె గోడపై తారకరాముడు సౌందర్య శ్రీకాంత్ ..బొమ్మలతో ..రోజు రెండు ఆటలు .. సా..6.30 రా..9.30 కి  అని నీలి మందుతో రాసిన అక్షరాలు .


మెయిన్ గేటుకి పక్కనె టికెట్లు ఇచ్చే స్థలం ..
కుర్చీ-5 రూ/
బెంచీ -3 రూ/
నేల-2 రూ/

నాన్న మాకు ముందుగానె టికెట్లు తేసి ఉంచాడు కుర్చీకి ..
సినేమా మొదలయ్యింది ..
సౌందర్య శ్రీకాంతూ ఇద్దరు బాగ చేసారు .. పాటలు బాగున్నాయి..
ఇంటెర్వెల్ లో  నాన్న మాకు బఠానీలు తీసుకొచ్చాడు.
మొత్తం  ఖర్చు 20 రూ/
హాయిగ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికెల్లాం.

ఇంకాఉంది...



























కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మరి మీ అభిప్రాయము చెప్పాలి కద...మరెందుకు ఆలస్యం ..కానియ్యండి..