10, మే 2013, శుక్రవారం

మా పక్కిల్లు

మా ఇంటి పక్కనె ఉన్న ఇంట్లొ మా బంధువులు ఉండె వారంట నాకు ఊహ తెల్సెసరికి వాల్లు ఉద్యొగరిత్య పక్క  ఊర్లకు బదిలి కావడం ..వాల్ల  ఇల్లు అద్దెకు ఇవ్వడం జరిగిందంట.
ఇప్పటికి ఆ ఇనృలొకి ఎవరొ ఒకరు రావడం.. వాల్లతొ  మీము అనుబంధం పెంచుకోవడం ..తీరా వాల్లు ఇల్లు కాలీ చేసి వెల్లిపొతుంటె బాధపడటం శరామామూలె
అలా మా పక్కింట్లొ దిగిన కొందరితొ పెంచుకున్న అంబంధం గురంచి మీతొ పంచుకొవాలనె ఈ టపా ..
లక్ష్మి  అక్క వాల్లది గుంటూరు ..తను వాల్ల అన్న ..బామ్మ .. మా ఊరికి పత్తి పండించడానికి వచ్చారు..
మాకు అంతకు ముందు గోంగూర తొ ఊరగాయ చేస్తారని తెలీదు ..కాని ఆ గుంటూరి మామ్మ మాకు అవి రుచిచూపించింది ..నిజంగ చాలా బాగున్నాయి  ..ఇవె కాక  రాములక్కయ్ (టమాట ) ఊరగాయి కూడ  మమ్మ గారి వల్లె పరిచయం ..
అంతకముందు మా ఊల్లొ పత్తి ఎవరు వేసేవారు కాదు.. దానికి నీటితొ పని అని ..మా ఊరి భూములన్ని
వర్షాధారమె ..
మా అన్నయ్య పేరు ఎర్రిస్వామి .. లక్ష్మక్కేమొ  వాల్ల వూరి ఏసతొ దీర్గం తీసి పిలిచేది ..తను మా అన్నయ్య ఇద్దరు మంచి మిత్రులు ..కలిసి మంచి నీల్లు మోసుకొచ్చేవాల్లు. 
అన్నయ్యేమొ అక్కకి వంటకి సాయం చేసేవాడు..
మా ఇంట్లొ రాజా అనె కుక్కపిల్ల ఉండేది ..దానికి లక్ష్మక్క మేము కలిసి స్నానం చేయించి ..మా పొత్తి నిక్కర్లు చ్హిని బనీన్లు వేసి వల్లం .. మేము ఇంట్లొ గదుల్లొ పరుగెడుతుంటె అది మా వెంటె వచ్చేది .. ఇప్పుడు తల్చుకుంటుంటె.. ఏదొ సంతోషం..బాధ..  (హచ్ ..యాడ్ గుర్తొచ్చిందా...)

వాల్లవల్ల  పత్తి పంట లొ ఏవొ ఎర్ర కాగితలు వాడుతారని ..పత్తిలొ కూడ ఆడ మగ అని జాతులుంటాయని..
పత్తి నుండి..దూదిని వేరుచెసెకి దూదిని ఏకేది  ఉంటుంది ..
అక్క వాల్ల అన్నేమొ అప్పుడప్పుదు అక్కని కొడుతుండె వాడు..మా అన్న ..అమ్మ తనని సముదాయించెవాల్లు.
అక్క వాల్ల పత్తి తొటకి ఎర్రకాగితాలు గుచ్చేకి వచ్చె తన ఈడు అమ్మయులతొ ఎప్పుడైతె అక్క బాగ మచ్చికైదం జరిగిందొ మాతొ మట్లాడడం తగ్గించింది..
అంతె అలా అలా దూరం పెరిగింది మనసుల మద్య ...
వాల్ల పంట అమ్మేసారు వాల్లు తిరిగి ఇంటికి వెల్లిపోతుంటె మౌనమె రాజ్యమేలింది ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మరి మీ అభిప్రాయము చెప్పాలి కద...మరెందుకు ఆలస్యం ..కానియ్యండి..