10, మే 2013, శుక్రవారం

మా పక్కిల్లు

మా ఇంటి పక్కనె ఉన్న ఇంట్లొ మా బంధువులు ఉండె వారంట నాకు ఊహ తెల్సెసరికి వాల్లు ఉద్యొగరిత్య పక్క  ఊర్లకు బదిలి కావడం ..వాల్ల  ఇల్లు అద్దెకు ఇవ్వడం జరిగిందంట.
ఇప్పటికి ఆ ఇనృలొకి ఎవరొ ఒకరు రావడం.. వాల్లతొ  మీము అనుబంధం పెంచుకోవడం ..తీరా వాల్లు ఇల్లు కాలీ చేసి వెల్లిపొతుంటె బాధపడటం శరామామూలె
అలా మా పక్కింట్లొ దిగిన కొందరితొ పెంచుకున్న అంబంధం గురంచి మీతొ పంచుకొవాలనె ఈ టపా ..
లక్ష్మి  అక్క వాల్లది గుంటూరు ..తను వాల్ల అన్న ..బామ్మ .. మా ఊరికి పత్తి పండించడానికి వచ్చారు..
మాకు అంతకు ముందు గోంగూర తొ ఊరగాయ చేస్తారని తెలీదు ..కాని ఆ గుంటూరి మామ్మ మాకు అవి రుచిచూపించింది ..నిజంగ చాలా బాగున్నాయి  ..ఇవె కాక  రాములక్కయ్ (టమాట ) ఊరగాయి కూడ  మమ్మ గారి వల్లె పరిచయం ..
అంతకముందు మా ఊల్లొ పత్తి ఎవరు వేసేవారు కాదు.. దానికి నీటితొ పని అని ..మా ఊరి భూములన్ని
వర్షాధారమె ..
మా అన్నయ్య పేరు ఎర్రిస్వామి .. లక్ష్మక్కేమొ  వాల్ల వూరి ఏసతొ దీర్గం తీసి పిలిచేది ..తను మా అన్నయ్య ఇద్దరు మంచి మిత్రులు ..కలిసి మంచి నీల్లు మోసుకొచ్చేవాల్లు. 
అన్నయ్యేమొ అక్కకి వంటకి సాయం చేసేవాడు..
మా ఇంట్లొ రాజా అనె కుక్కపిల్ల ఉండేది ..దానికి లక్ష్మక్క మేము కలిసి స్నానం చేయించి ..మా పొత్తి నిక్కర్లు చ్హిని బనీన్లు వేసి వల్లం .. మేము ఇంట్లొ గదుల్లొ పరుగెడుతుంటె అది మా వెంటె వచ్చేది .. ఇప్పుడు తల్చుకుంటుంటె.. ఏదొ సంతోషం..బాధ..  (హచ్ ..యాడ్ గుర్తొచ్చిందా...)

వాల్లవల్ల  పత్తి పంట లొ ఏవొ ఎర్ర కాగితలు వాడుతారని ..పత్తిలొ కూడ ఆడ మగ అని జాతులుంటాయని..
పత్తి నుండి..దూదిని వేరుచెసెకి దూదిని ఏకేది  ఉంటుంది ..
అక్క వాల్ల అన్నేమొ అప్పుడప్పుదు అక్కని కొడుతుండె వాడు..మా అన్న ..అమ్మ తనని సముదాయించెవాల్లు.
అక్క వాల్ల పత్తి తొటకి ఎర్రకాగితాలు గుచ్చేకి వచ్చె తన ఈడు అమ్మయులతొ ఎప్పుడైతె అక్క బాగ మచ్చికైదం జరిగిందొ మాతొ మట్లాడడం తగ్గించింది..
అంతె అలా అలా దూరం పెరిగింది మనసుల మద్య ...
వాల్ల పంట అమ్మేసారు వాల్లు తిరిగి ఇంటికి వెల్లిపోతుంటె మౌనమె రాజ్యమేలింది ...

9, మే 2013, గురువారం

ఇప్పటికీ నన్ను వెంటాడె ఒక కమ్మని పాట

ఈ పాట మానవుడు దానవుడు అనే  శోభన్ బాబు ..శారద..కృష్ణకుమారి..నటించిన..మన తెలుగు చలన చిత్రం లోనిది..
ఇదే  చిత్రంలొ ఇంకొ మంచి పాట కూడ  ఉంది ..అది కూడ మీ కొసం ఇక్కడ అందిస్తున్న..
తేజ చానెల్   వచ్చిన కొత్తలొ..ఇలంటి పాత సినిమాలు బాగా వేసేవాడు..    
ఈ సినిమా లొ  కృష్ణకుమారి,శోభన్ బాబు ..తోబుట్టువులు ..పేదరికం లొ ఉంటారు... .
తన తమ్ముని ఆకలి తీర్చలేక  అప్పుడు ఆ అక్క  పాడె జోల పాట  ఇది..






అదే సినిమాలోని    ఇంకో పాట

నా చినప్పుడు నేను ఇంతె..

మరేమొ అది నేను బాగ చిన్నగ ఉన్నప్పుడు అన్నమాట.. అంటె.. ఇప్పటికి మల్లె కాకుండ అన్నమాట..
మా ఊరు ఒక గ్రామం .. అంటె పల్లెకన్న పెద్దది..పట్నం కన్న..చిన్నది..మా నాన్నగారేమొ బాగ పూజలు  చేసేవారన్నమట..  (ఇప్పటికీ చేస్తారనుకొండి.... అది వేరే  మాట..)
రోజు గుడికి ఒక చిన్న గిన్నెలొ ఆముదమ ఒత్తి  వేసుకు వెళ్ళేవారు .. ఉదయం సాయంత్రం.. దీపారాదనికి..
అప్పుడప్పడు  నేను కూడ వెళ్ళేవాన్ని ..నాన్నగారికి  వీలు కుదరనప్పుడు ..
ఒక రోజు .. నేను గుడికి వెళ్ళల్సి వచ్చింది ..అప్పుడు..సయంత్రం.. సరిగ్గ అదె సమయానికి ..కరెంటు..పొయింది..
చీకట్లొ..చిన్నగిన్నలొకి ..ఎక్కువ ఆముదం ఒంపా.. చుసుకోకుండ.. అమ్మ ఎక్కడ వీపు విమానం మొత మొయిస్థుందొ అనేసి.. ఒంపినదాన్ని  మెల్లిగ  నెత్తికి రాసేస..
తర్వాత ..గిన్ని కింది కూడ ఉంది కదా అని దాన్ని తలపైకు తీసుకెల్లి తలకు రాసుకుందామని  గిన్ని పైకెత్తితె ..
ఏముంది  .. ఆ గిన్న జారి  అముదం  మొత్తం మొహంపై ..బట్టలపై..
అమ్మ వచ్చి ఎక్కడ కొడుతుందొ ఏమొ  అనుకున్న..కాని నా అవతారం చూసి నవ్వేసింది....