9, మే 2013, గురువారం

నా చినప్పుడు నేను ఇంతె..

మరేమొ అది నేను బాగ చిన్నగ ఉన్నప్పుడు అన్నమాట.. అంటె.. ఇప్పటికి మల్లె కాకుండ అన్నమాట..
మా ఊరు ఒక గ్రామం .. అంటె పల్లెకన్న పెద్దది..పట్నం కన్న..చిన్నది..మా నాన్నగారేమొ బాగ పూజలు  చేసేవారన్నమట..  (ఇప్పటికీ చేస్తారనుకొండి.... అది వేరే  మాట..)
రోజు గుడికి ఒక చిన్న గిన్నెలొ ఆముదమ ఒత్తి  వేసుకు వెళ్ళేవారు .. ఉదయం సాయంత్రం.. దీపారాదనికి..
అప్పుడప్పడు  నేను కూడ వెళ్ళేవాన్ని ..నాన్నగారికి  వీలు కుదరనప్పుడు ..
ఒక రోజు .. నేను గుడికి వెళ్ళల్సి వచ్చింది ..అప్పుడు..సయంత్రం.. సరిగ్గ అదె సమయానికి ..కరెంటు..పొయింది..
చీకట్లొ..చిన్నగిన్నలొకి ..ఎక్కువ ఆముదం ఒంపా.. చుసుకోకుండ.. అమ్మ ఎక్కడ వీపు విమానం మొత మొయిస్థుందొ అనేసి.. ఒంపినదాన్ని  మెల్లిగ  నెత్తికి రాసేస..
తర్వాత ..గిన్ని కింది కూడ ఉంది కదా అని దాన్ని తలపైకు తీసుకెల్లి తలకు రాసుకుందామని  గిన్ని పైకెత్తితె ..
ఏముంది  .. ఆ గిన్న జారి  అముదం  మొత్తం మొహంపై ..బట్టలపై..
అమ్మ వచ్చి ఎక్కడ కొడుతుందొ ఏమొ  అనుకున్న..కాని నా అవతారం చూసి నవ్వేసింది....

2 కామెంట్‌లు:

మరి మీ అభిప్రాయము చెప్పాలి కద...మరెందుకు ఆలస్యం ..కానియ్యండి..